తెలుగు శాఖ అధ్యాపకుల ఆహ్వానం మేరకు 22.06.2023 న చీరాల లోని Y.A. ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి ‘మహాభారతంలో మహర్షుల ప్రబోధాలు’ అనే అంశం పై అతిథి ఉపన్యాసం ఇచ్చారు. మహాభారతాన్ని రాసిన వ్యాసుడు ఒక ఋషి అని, వ్యాసుని తండ్రి పరాశరుడు ఋషే నని, వ్యాసుని శిష్యులు పైలుడు, సూతుడు, వైశంపాయనుడు జయ సంహితను మహాభారతంగా చేశారని, జనమేజయుని సర్ప యాగానికి కారణమైన ఋషి శృంగి, సర్ప యాగాన్ని ఆపిన ఋషి ఆస్తీకుడు. శక్తి, ఆరుని మహర్షి ఆయన కుమారుడు పేరు కూడా ఆరుని. వశిష్టుడు, గౌతమ, నారద మొదలైన మహర్షుల ప్రబోధాలు మహా భారతం లో ఉన్నాయని వారందరూ కూడా నాటి సమాజాని ఎన్నో ప్రబోధాలు చేశారని అవి సర్వకాల సర్వావస్థులయందు సర్వమానవాళికి ఉపయోగ పడేవే కాబట్టి, నేటి సమాజానికి కూడా అవి ఉపయుక్తమైనవే అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు డా. కె. సురేష్ కుమార్, అధ్యాపకులు డా. వి. భవాని, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, 35 మంది స్పెషల్ తెలుగు విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: మహాభారత వైశిష్ట్యాన్ని గురించి, మహాభారతం లోని ఋషుల గురించి, వారి వ్యక్తిత్వం, వారు చేసిన ప్రబోధాల గురించి అవగాహన పొందారు.
కళాశాల స్థాయి సాహిత్య పోటీలు
తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా కళాశాల స్థాయి సాహితీ పోటీలను ప్రభుత్వ మహిళా కళాశాల (స్వ. ప్ర.) లో తెలుగు శాఖ అధ్యాపకులు 22.08.2023 న నిర్వహించారు. ఈ పోటీలలో వ్యాసరచన, వక్తృత్వ, పద్య పఠన, కవితా రచన, కథారచన, సామెతల వివరణ పోటీలను నిర్వహించారు.
వ్యాస రచన అంశం: ‘తెలుగుభాష – మాధుర్యము’
వక్తృత్వ అంశం: ‘వ్యావహారిక భాషోధ్యమకర్త గుడుగు’
సామెతలు వాటి వివరణ
అంశం: కవిత్వ, కథలకు స్వేచ్ఛా వస్తువును ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, 44 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: విద్యార్థులు ఆయా అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారు. పోటీలలో పాల్గొనే నిమిత్తం తెలియని అంశాలను తెలుసుకునే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు.
జిల్లా స్థాయి సాహిత్య పోటీలు
Event Description: గిడుగు రామ మూర్తి పంతులు గారి 160 వ జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాలల జిల్లా స్థాయి సాహితీ పోటీలను 24.08.2023 న ప్రభుత్వ మహిళా కళాశాల (స్వ. ప్ర.) లో నిర్వహించారు. ఈ పోటీలకు కన్వీనర్ గా డా. డి. ధాత్రికుమారి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తెలుగు భాషాభిమానులు పాల్గొనాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కళాశాల విద్య, గుంటూరు డా. వి ఆర్. జ్యోత్స్నకుమారిగారు తెలిపారు.
గుంటూరు జిల్లాలోని చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెదనందిపాడు డిగ్రీ కళాశాల, శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాల, మొదలైన పది కళాశాలలు ఈ పోటీలలో పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో డా. వి. భవాని, డా. ధాత్రి కుమారి కథ, కవిత్వ రచనలను నిర్వహించగా, వ్యాసరచన పోటీలకు డా. పి. విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహించగా, డా. యన్. విజయలక్ష్మి వక్తృత్వ పోటీలను నిర్వహించారు, డా. యస్. దివిజాదేవి పద్య పఠన పోటీలను నిర్వహించారు. ఆంగ్ల, హిందీ, శాఖల అధ్యాపకులు శ్రీ చంద్రశేఖరరావు, శ్రీ కుటుంబరావు, డా. విజయకుమారి, డా. శేషు, డా. శాంతి శ్రీదేవి డా. అనిత, శ్రీమతి ప్రణయజ, శ్రీ ఖాదర్ భాష ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: విద్యార్థులు ఆయా అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారు. పోటీలలో పాల్గొనే నిమిత్తం తెలియని అంశాలను తెలుసుకునే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. వారిలో sportiveness ఏర్పడుతుంది.
తెలుగుభాషా దినోత్సవం
Event Description: తెలుగు శాఖ ఆధ్వర్యంలో గిడుగురామ మూర్తి పంతులు గారి 160వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా 29.08.2023 న జరిగాయి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి కె.యం.యస్. శైలజ రాణి ప్రజలు మాట్లాడే భాషే ప్రజాభాష, మాతృభాష. అమ్మలాంటిదే అమ్మ భాష కూడా, మాతృభాష వస్తేనే ఇతర భాషల్లో ప్రావీణ్యం సాధించగలం అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రత్యేక అతిథిగా హాజరైన’తానా’ పూర్వపు అధ్యక్షులు, ప్రస్తుత ‘తానా’ భాష, సాహిత్య, సాంస్కృతిక విభాగం నిర్వాహకులు, ప్రవాసాంధ్రులు, డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ, “మాతృభాష పట్ల అవగాహనరక్తిని, అనురక్తి, ఆసక్తిని ఇనుమడింపజేయాలి, అది తొలుత మనఇంటినుంచే ప్రారంభం కావాలన్నారు. చంద్రయాన్ రూపకర్తల్లో తెలుగు మూలాలున్న శాస్త్రజ్ఞులు కూడా వున్నారు. తెలుగు మీడియంలో చదువుకొన్న వారూ వున్నారు. కలామ్, సత్య నాదెండ్ల లాంటి ప్రముఖులు కూడా తమ మాతృబాషలో చదువుకున్న వారే అన్నారు.”
ముఖ్య వక్త డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ "నేను ఫలానా కులం వాడ్ని, నేను ఫలానామతం వాడ్ని,నేను ఫలానా ప్రాంతం వాడ్నిఅని చెప్పుకునేకంటే ఫలానా భాష వాడ్నిఅనే చెప్పుకుంటే గౌరవమన్నారు. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనే అత్యంత సంగీతాత్మకమైన(లిరికల్ ) భాష మన తెలుగుభాష” అన్నారు.
ఈ కార్యక్రమంలో సాహితీ విమర్శకుడు ఎ. రజాహుస్సేన్, తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, 104 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘తానా’ వారు ప్రచురించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యాన్ని ఆవిష్కరించడం జరిగినది.
Outcome: విద్యార్థినులు తెలుగు భాషా వైభవాన్ని అవగతం చేసుకున్నారు.
గురజాడ జయంతి
Event Description: గురజాడ అప్పారావు గారి జయంతిని తెలుగు శాఖ అధ్యాపకులు 21.09.2023 న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి కె.యం.యస్. శైలజ రాణి అధ్యక్షత వహించారు. గురజాడ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించిన తరువాత వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి శైలజ రాణి మాట్లాడుతూ, “తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ హేతువాదిగా, రచయితగా, సంఘ సంస్కర్త గా, అభ్యుదయ కవిగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు” అని కొనియాడారు.
తెలుగుశాఖ అధ్యక్షులు డా. వి. భవాని గురజాడ జీవితము రచనల పై మాట్లాడుతూ వారి జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలను, రచనా నేపధ్యాన్ని వివరించారు. , డా. యన్. విజయలక్ష్మి గురజాడ రాసిన “దేశభక్తి” గీతాన్ని గూర్చి వివరిస్తూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషు లోయ్ అనే భావన విశ్వ జనీన దృక్పథాన్ని ప్రకటిస్తుందని, విశ్వ వాఙ్మయంలో ఈ గేయానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. డా. ధాత్రి కుమారి గురజాడ “కథానికలు” గురించి వివరిస్తూ, ‘సామాజిక రుగ్మతలను సంస్కరించేందుకు కాలం పట్టిన యోధుడు గురజాడ అన్నారు. డా. యస్. దివిజాదేవి గురజాడ రాసిన “పూర్ణమ్మ” గురించి మాట్లాడుతూ ‘సాహిత్యంలో ఆధునిక భావజాలానికి బీజం వేసిన మహానుభావులు గురజాడ పూర్ణమ్మ, కన్యకల ద్వారా నాటి సామాజిక సమస్యలను ప్రస్తావించారు’ అన్నారు. డా. పి. విజయలక్ష్మి గురజాడ రాసిన “కన్యాశుల్కం” నాటకాన్ని గురించి వివరిస్తూ, 1890 ప్రాంతంలో పూర్తి వాడుక భాషలో రచించారు. వీరు సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు పాత్రలు తెలుగువారి మదిలో శాశ్వతత్వాన్ని పొందాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: గురజాడ జీవితము, రచనలపై పూర్తి అవగాహనను పొందారు, వారి సంఘ సంస్కరణ దృక్పథాన్ని, దేశభక్తిని అర్థం చేసుకున్నారు.
జాషువా జయంతి
Event Description: తెలుగు శాఖ ఆధ్వర్యంలో కళాశాలలోని అసెంబ్లీ హాల్ లో జాషువా జయంతి వేడుకలు 27.09.2023 న నిర్వహించబడ్డాయి. జాషువా చిత్రపటానికి నివాళులు అర్పించిన తరువాత కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డా. వి.ఆర్. జ్యోత్స్న కుమారి గారు మాట్లాడుతూ, “కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై తిరుగబడ్డ జాషువా ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. జీవితం లో ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొన్న జాషువా మహాకవిగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం” అన్నారు.
తెలుగుశాఖ అధ్యక్షులు డా. భవాని జాషువా జీవితాన్ని, ఎదుర్కొన్న ఒడిదుడుకులను వివరించగా, తెలుగుశాఖ అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి ఆయన రచనలలో సర్వోత్తమమైనది గబ్బిలం అని గబ్బిలం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించారు. డా. ధాత్రి కుమారి ఫిరదౌసిలో ఒక కవి ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారని అన్నారు. డా. యస్ దివిజాదేవి వారి ఆత్మ కథ ‘నా కథ’ లోని విశేషాలను వివరించారు. వారు రాసిన జీవిత కథలు క్రీస్తు చరిత్ర, బాపూజీ లను గురించి. డా. పి. విజయలక్ష్మి వివరించారు.
Outcome: జాషువా జీవితాన్ని, రచనలను గురించిన సమగ్ర అవగాహనను పొందుతారు. వారి సాహిత్య ప్రస్థానాన్ని అవగతం చేసుకున్నారు.
క్షేత్ర పర్యటన – కొండవీడు
Event Description: తెలుగు శాఖ అధ్యాపకులు విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా 11.10.2023 న కొండవీడు వెళ్ళడం జరిగినది. విద్యార్థినులు అందరూ వచ్చాక కళాశాల నుండి ఉదయం 8.30 గం. లకు బస్సులో కొండవీడు బయలుదేరాము. ఇది గుంటూరు నుండి 20 కి.మీ., దూరంలో ఉంది. ముందుగా ఫిరంగిపురంలో ఉన్న “బాలయేసు కేథడ్రల్ చర్చి” కి వెళ్ళాము. అక్కడ మొత్తం తిరిగి ఆ ఎత్తైన కట్టడాలను చూసి ఆశ్చర్యపోయాము. ఈ చర్చికి దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలలోని అతిపెద్ద రెండవ చర్చి. తరువాత కొండవీటి రెడ్డి రాజుల మ్యూజియం దగ్గర ఆగాము. బయట టికెట్ తీసుకొని మ్యుజియం లోపలికి వెళ్ళాము. అక్కడ వారి వంశ చరిత్రను తెలిపే ఫలకాలను, వారు ఉపయోగించిన వస్తువులను నాటి శిలా శాసనాలను చూసాము.
కొండవీడు మ్యూజియం చూశాక అక్కడికి దగ్గరలో ఉన్న చంఘీజ్ ఖాన్ పేట లోని “వెన్న ముద్ద కృష్ణుడి” ఆలయానికి చేరుకున్నాము. ఈ ఆలయం కొండవీడు కోటకు దిగువన ఉన్నది. ఆలయం లోని విగ్రహం బాలకృష్ణుడి రూపంలో చేతిలో వెన్నముద్దతో ఉన్నది. అక్కడ ప్రసాదంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులను ఇచ్చారు. దర్శనం తరువాత దగ్గరలో ఉన్న కత్తుల భావి దగ్గరకు వెళ్ళాము. కత్తుల భావి ప్రదేశం వేణూనాథ స్వామి ఆలయమట. అక్కడ దుండగులను సంహరించి ఆ కత్తుల భావిలో వేశారట. ఆ భావి ఉన్న గది ఇప్పటికీ కుళ్లిపోయిన శవాల వాసన వస్తుంది.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి,
డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, 78 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: కొండవీడు రాజుల పూర్తి చరిత్ర తెలుసుకోవడంతో పాటు వారి స్మృతి చిహ్నాలను చూడటం ద్వారా ఆ విషయాలు వారి మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. వారి సంస్కృతిని, చారిత్రక వైభవాన్ని అర్థం చేసుకున్నారు.
క్షేత్ర పర్యటన – నంది నాటకోత్సవాలు
Event Description: రాష్ట్ర ప్రభుత్వం నాటక కళను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా నంది నాటకోత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు లోని శ్రీ వేంకటేశ్వరా కళామందిరం లో పౌరాణిక, సాంఘిక నాటకాలను ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకాలను విద్యార్థినులకు చూపించాలనే ఉద్దేశ్యంతో స్పెషల్ తెలుగు విద్యార్థినులను 28.12.2023 న నాటక ప్రదర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ అభినయ ఆర్ట్స్ గుంటూరు వారిచే ప్రదర్శింప బడిన ‘ఇంద్రప్రస్థం’ అనే సాంఘిక నాటకాన్ని విద్యార్థులకు చూపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, 51 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: విద్యార్థులు నాటకాలపై పూర్తి అవగాహనను పొందారు. సోషల్ మీడియా ప్రలోభంలో పడి సాంప్రదాయ కళలను మరిచిపోతున్న విద్యార్థులను ఈ నాటకాలను చూపించడం ఒక మంచి అనుభవం.
వేమన జయంతి
Event Description: వేమన జయంతిని తెలుగు శాఖ అధ్యాపకులు 19.01.2024 న విద్యార్థుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. తెలుగుశాఖ అధ్యక్షులు డా. వి. భవాని “వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. సి. పి. బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839 లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు” అన్నారు.
డా. యన్. విజయలక్ష్మి “కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు” అన్నారు. డా. ధాత్రి కుమారి “మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయన వాడిన ఆయుధం హేతువు లేక తర్క శీలత్వం అన్నారు. డా. యస్. దివిజాదేవి “వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి అన్నారు. డా. పి. విజయలక్ష్మి “నైతికత్వం గురించి, స్త్రీల సమస్యల గురించి ఆనాడే చర్చనచ్చిన కవి వేమన అంటూ కొన్ని పద్యాలను ఉదాహరించారు. ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: వేమన జీవితము, రచనలపై పూర్తి అవగాహనను పొందారు, వారి సంఘ సంస్కరణ దృక్పథాన్ని, దేశభక్తిని, ఆకాలం నాటి, నేటికీ అనుసరిస్తున్న మూఢనమ్మకాల గురించి అర్థం చేసుకున్నారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం – సాహిత్య పోటీలు
Event Description: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కళాశాల స్థాయి సాహితీ పోటీలను ప్రభుత్వ మహిళా కళాశాల (స్వ. ప్ర.) లో తెలుగు శాఖ అధ్యాపకులు నిర్వహించారు. ఈ పోటీలలో వ్యాసరచన, వక్తృత్వ, పద్య పఠన, కవితా రచన, కథారచన నిర్వహించారు.
వ్యాస రచన అంశం: ‘మాతృభాష - ప్రాముఖ్యత’
వక్తృత్వ అంశం: ‘మాతృభాషా పరిరక్షణకు మావంతు కృషి’
కవిత్వ, కథా రచనలకు స్వేచ్ఛా వస్తువు.
పద్య పఠన పోటీలు.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: విద్యార్థులు ఆయా అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారు. పోటీలలో పాల్గొనే నిమిత్తం తెలియని అంశాలను తెలుసుకునే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
Event Description: 22.02.2024 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి శైలజ రాణి అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రకాశనం తో కార్యక్రమం ప్రారంబింప బడింది. వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి శైలజ రాణి మాట్లాడుతూ, “మన అస్తిత్వానికి చిహ్నం మాతృభాష, ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువద్దని” అన్నారు.
ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య స్వరూపరాణి గారు – “నాగరికత తెలిసిన ప్రతీ జాతి తన మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. నూడికారపు సొంపులతో విలసిల్లేది మాతృభాషాలే అన్నారు. ఆదివాసీ సమూహాలు వాడే భాష అసలైన తెలుగుభాష. ఎందుకంటే వారు ఇతర భాషల కలయికకు దూరంగా ఉన్నారు” అన్నారు.
డా. నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ, బువ్వ, కూడు, మప్పయిదాలు, అత్త, మామ లాంటి అచ్చ తెలుగు పదాలు నేడు కనుమారుగవుతున్నాయని అన్నారు. శ్రీ షేక్ అబ్దుల్లా గారు మాతృభాష పరిరక్షణకు బంగ్లాదేశ్ యువకులు కావించిన బలిదానాలను వివరించారు. శ్రీమతి జ్యోతిరాణి ఇంగ్లీషు, సంస్కృతం లాంటి భాషాలనుండి తెలుగును వేదుక్కునే పరిస్థితి నేడు ఉంది అన్నారు. అనంతరం ఆచార్య స్వరూపరాణి గారు రచించిన “మిణుగురులు” పుస్తకావిష్కరణ జరిగినది.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: మాతృభాష కోసం ప్రాణాలర్పించిన యోధులను గురించి తెలుసుకున్నారు. మిణుగురులు పుస్తకం ద్వారా సమాజ రుగ్మతలకు ఎదురు తిరిగి తమ ఉనికిని కాపాడుకున్న మహిళామణులను గురించి తెలుసుకున్నారు.
క్షేత్ర పర్యటన – భట్టిప్రోలు
Event Description: తెలుగు శాఖ అధ్యాపకులు విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా 12.03.2024 న చేబ్రోలు, ఛందోలు, భట్టిప్రోలు వెళ్ళడం జరిగినది. తామ్రపురం, జయవోలు, శంభోలు అనే పేర్ల నుండి చేబ్రోలు అనే పేరు వచ్చింది. చేబ్రోలులో అనేక చాళుక్య శాసనాలు లభ్యమయ్యాయి. బృహత్ శిలా యుగం నాటి రాగి, ఇనుము, వంటి లోహాలను కనుగొని లోహ పరిశ్రమ ప్రారంబించిన విషయాలను సూచించే గ్రామనామాల్లో చేబ్రోలు కూడా ఒకటి. ఇక్కడ చాళుక్యుల నాటి అనేక శాసనాలు లభ్యమయ్యాయి. పూర్వం చేబ్రోలులో 101 గుళ్ళు, 101 బావులు ఉన్నట్లు ప్రసిద్ధి. అందువలన చేబ్రోలును చిన్న కాశీ అని పిలిచేవారు.
భట్టిప్రోలు బౌద్ధ స్తూపం ప్రపంచ బౌద్ధారామాలలోనే విశిష్టత సంతరించుకుంది. ఇది బుద్దుని ధాతువుపై నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. తెలుగు లిపి భట్టిప్రోలులోనే ప్రారంభమైనట్టు ఆధారాలు లభించాయి. మౌర్య లిపి లోని 23 అక్షరాలను ఈ స్తూపం వద్దనే కనుగొన్నట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీ. పూ. నాలుగో శతాబ్దంలో మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో భట్టిప్రోలు ఒకటి కుబేరుడు అనే రాజు స్తూప విహారాలను నిర్మించి గొప్ప బౌద్ధ క్షేత్రాన్ని రూపొందించినట్టు స్పష్టమవుతుంది. చక్రాకారంలో నిర్మించిన ఈ స్తూపం 40 అడుగుల ఎత్తులో ఉంది. మౌర్య లిపికి చెందిన 23 అక్షరాలలో గ, ష అనే అక్షరాలు మౌర్య లిపిగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు దాదాపు మన తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. ఘ, జ, మా, ల, ష అనే ఐదు అక్షరాలు కూడా మౌర్య లిపి లోనివే. గ, మ అనే వర్ణాలు మౌర్యుల కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కనిపించని ళ ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు అశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించాలి.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, 78 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: ఇలాంటి చారిత్రక ప్రాశస్త్య ప్రదేశాలను విద్యార్థులకు చూపించడం జరిగినది. అక్కడి శాసనాలను చూసి తెలుగు భాష, ప్రాంతాల ఉన్నతిని విద్యార్థులు అవగతం చేసుకున్నారు.
అతిథి ఉపన్యాసం
Event Description: శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. శ్రీనివాస రావు, ‘లలిత కళలు – సాహిత్యం’ అనే అంశం పై 26.03.2024 న అతిథి ఉపన్యాసం ఇచ్చారు. లలిత కళలు అనే మాట ఆంగ్ల భాష లోని ‘Fine Arts’ అను పదమునకు పర్యాయ పదంగా వాడబడుతుందని, చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము అనే ఐదు ఈ తెగకు చెందినవి. ఇవన్నీ ప్రతిభా నైపుణ్యాలకు చెందినవి, కళలు మొత్తం 64 కాగా, వాటిలో మానవాళికి హృదయానందాన్ని కలిగించేవి లలిత కళలు. ఇవి ఐదు.
చిత్రలేఖనము: చక్షురింద్రియములకు ఆనందాన్ని చేకూర్చేది ఇది. దీనిని కాన్వాస్ పైన గీయడం జరుగుతుంది.
శిల్పము: ఇది కూడా ఇంచుమించుగా చిత్రలేఖనం వంటిదే, శిలను శిల్పముగా మార్చడం శిల్పి చేసే పని.
సంగీతము: శ్రవణేంద్రియము ద్వారా ఆనందాన్ని పొందే కళ సంగీతము.
నృత్యము: ఇది భావాశ్రయమైనది. నృత్యము, నాట్యము అని ఇది రెండు రకాలు.
సాహిత్యము: ఇది కూడా శ్రవణేంద్రియమునకు సంబంధించినది. లలిత కళలలో ఇది ప్రశస్తమైనది. లలిత కళలలో కవిత్వానిది అగ్రస్థానం. కావ్యాలలో నాటకానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. జాతిని జాగృతం చేయడంలో తెలుగు వారందరూ గర్వపడేంత విశేషమై వెలుగొందుతుంది. అంటూ లలిత కళలలో భాగ్యమైన సాహిత్యాన్ని గురించి చెప్పారు
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు అధ్యాపకులు డా. వి. భవాని, అధ్యాపకులు డా. యన్. విజయలక్ష్మి, డా. డి. ధాత్రికుమారి, డా. యస్. దివిజాదేవి, డా. పి. విజయలక్ష్మి, మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Outcome: లలిత కళలు, దానిలో కవిత్వం యొక్క స్థానం గురించి, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య ప్రస్థానం గురించి సమగ్రంగా తెలుసుకున్నారు.
Departmental Activities 2022-23
మహా యోధుడు అల్లూరి సీతారామరాజు గురించి విద్యార్థినులకు తెలియజేయాలనే ఉద్దేశ్యం తో తెలుగు శాఖ అధ్యాపకులు తాము వెళ్ళే తరగతుల లోని విద్యార్థులకు ఆ మహానుభావుని త్యాగశీలతను, పోరాట స్పూర్తిని వివరించడం జరిగింది. 04.07.2022
‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ లో రచయిత్రులైన డా. కె. యస్. మల్లీశ్వరి, డా. పి. రాజేశ్వరి, డా. ఎండ్లూరి మానస లను “అనువాద సాహిత్యం–స్త్రీ” అనే అంశం పై అవగాహనా సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానించడం జరిగింది. 07.2022
తెలుగుశాఖ అధ్యాపకులు డా.వి. భవాని ప్రత్యేక తెలుగు విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన ‘రిఫరెన్స్’ పుస్తకాలను పంపిణీ చేశారు. 07.2022
జాషువా వర్ధంతి (24.07.1971) సందర్భంగా ‘జాషువ – జాతీయోద్యమం’ అనే అంశం పై ప్రముఖ రచయిత, విమర్శకులు డా. నందనవనం శ్రీనివాసరావు గారి అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. 07.2022
డిగ్రీ విద్యార్థులకు II లో ‘తాతకో నూలుపోగు’ అనే పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశ రచయిత డా. బండారు ప్రసాదమూర్తి. వీరితో ‘Teachmint’ వేదికగా ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు తమ సందేహాలను రచయితను అడిగి తెలుసుకున్నారు. 02.08.2022
‘ఆజాదీకా అమృత్ మహోత్సవం’ కార్యక్రమం లో భాగంగా దేశభక్తి గీతాల పోటీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. 08.2022
“ఆజాదీ కా అమృత్ మహోత్సవం” సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మన కళాశాల తెలుగు శాఖ రెండు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ను ZOOM వేదికగా “జాతీయోద్యమం – అనుభవాలు, జ్ఞాపకాలు, సాహిత్యం” అనే అంశం పై నిర్వహించింది. 10,11.08.2022
వ్యావహారిక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘తెలుగుభాషా దినోత్సవం’ వేడుకలను నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రత్యేక వక్త గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా. పాపినేని శివశంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. 08.2022
మహాకవి జాషువా జయంతిని పురస్కరించుకొని తెలుగు విభాగము మరియు గుంటూరు లోని జాషువా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలను నిర్వహించింది. 23.09.2022
జాషువా జయంతిని పురస్కరించుకొని ముఖ్య వక్త గా నందిగామ డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యులు డా. చాట్ల కిశోర్ గారిని ఆహ్వానించడం జరిగింది. 09.2023
విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను గుంటూరు లోని బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శనశాలకు తీసుకెళ్లడం జరిగింది. 11.2022
వేమన జయంతిని పురస్కరించుకొని వేమన జీవితం, పద్యాల పైన విస్తృతమైన పరిశోధన చేసి, వారి భావ పరంపరను, అచల సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న శ్రీ గుత్తికొండ చంద్రశేఖర్ రెడ్డి (యోగీశ్వరానంద) గారిని ముఖ్య వక్త గా ఆహ్వానించాము. 01.2023
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మాతృభాషల ప్రాధాన్యాన్ని వివరించడానికి ప్రముఖ కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు డా. పెనుగొండ లక్ష్మీ నారాయణ గారిని ఆహ్వానించడం జరిగిoది. 02.2023
తెలుగు శాఖ ఒక అతిథి ఉపన్యాసాన్ని పద్యనాటకం పై పెట్టాలని నిర్ణయించింది దీనికోసం గాను నాటకానుభవం కలిగిన వినుకొండ ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు శ్రీ జి. అంజయ్య గారిని ఆహ్వానించడం జరిగిoది. 02.2023
తెలుగు శాఖ నిర్వహించే భాషా, సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలలో, భాగంగా అనువాద ఆవశ్యకత మీద ఒక కార్యక్రమం నిర్వహించాము. దీని కోసం మైసూరు లోని భారతీయ భాషల కేంద్రం (CIIL) జాతీయ అనువాద సంస్థ( NTM) లో ‘సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్’ Dr.P.మాత్యూస్ గారి సహకారం తో Skill Development Programme on English - Telugu Translation” అనే అంశం మీద కార్యశాల (work shop) ఏర్పాటు చేయడమయినది. 02.2023 – 20.02.2023
విద్యార్థులకు లేఖనము యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ లేఖన నైపుణ్యాలను తెలియ జేయడం కోసం శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. లేఖన నైపుణ్యాలను తెలుసుకునే ముందు విద్యార్థులకు భాషానైపుణ్యాలను కొంచం పరిచయం చేయడం అవసరం కనుక శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం గురించి పరిచయం చేసాము. 03.2023 – 01.04.2023
Departmental Activities 2021-22
ప్రముఖ రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతిని పురస్కరించుకొని కళాశాలలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. 06.10.2021
“ప్రగతి దివస్” సందర్భంగా తెలుగు, హిందీ, సంస్కృత, చరిత్ర శాఖల అధ్యాపకులు వాల్మీకి జయంతిని ఘనంగానిర్వహించడంజరిగింది. 10.2021
“భువి నుండి దివి కేగిన తెలుగు సాహితీ వెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి” కి స్మృత్యoజలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 19.12.2021
“మాలపల్లి వందేళ్ల ప్రస్థానం” అనే అంశంపై నిర్వహించిన అతిధి ఉపన్యాస కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు, హైదరాబాద్ లోని ‘సిటీ ప్రభుత్వ కళాశాల (స్వ. ప్ర.) లో సహాయ ఆచార్యులుగా ఉన్న డా. కోయి కోటేశ్వర రావు గారు ప్రధాన వక్త గా విచ్చేశారు. 10.12.2021
విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను గుంటూరు లోని బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శనశాలకు తీసుకెళ్లడం జరిగింది. 13.12.2021.
“అనువాద విద్య” అనే అంశంపై నిర్వహించిన అతిధి ఉపన్యాస కార్యక్రమంలో ప్రముఖ అనువాదకులు, మైసూరు లోని ప్రాచీన భాషల అధ్యయన కేంద్రo (CIIL) లోని ‘నేషనల్ ట్రాన్సలేషన్ మిషన్ (NTS)’ లో ‘ఛీఫ్ రిసోర్స్ పర్సన్’ గా ఉన్న డా. పత్తిపాటి మాథ్యూ గారు పాల్గొన్నారు. 31.12.2021
‘భువి నుండి దివి కేగిన’ తెలుగు సాహితీ దిగ్గజం, ప్రముఖ కవి, సాహితీకారులు, అద్వితీయ వక్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి స్మృత్యoజలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 31.01.2022
“దీక్షారంబ్” (04.02.2022) కార్యక్రమంలో భాగంగా డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు “మాతృభాష లో అభివ్యక్తి నైపుణ్యాలు” అనే అంశం పై వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. 03.02.2022.
“అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం” సందర్భoగా గుంటూరు నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవిత్వం పోటీలు నిర్వహించడం జరిగినది. 19.02.2022.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు, అమ్మనుడి పత్రిక సంపాదకులు డా. సామాల రమేష్ బాబుగారు, తెలుగుభాషా పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు డా. వెనిశెట్టి సింగారావు గారు ముఖ్య వ్యక్తలుగా వచ్చారు. 21.02.2022
డా. యస్. దివిజాదేవి, APSCHE వారు విద్యార్థులకు పుస్తకాలను పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో ప్రవేశ పెట్టిన ‘Talk the Book’ కార్యక్రమంలో పాల్గొని, మహాకవి కాళిదాసు రచించిన “మేఘసందేశం” కావ్యాన్ని ZOOM వేదికగా విశ్లేషించడం జరిగింది. 02.2022
విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను అమరావతికి తీసుకెళ్లడం జరిగింది. 07.03.2022.
విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను ఉండవల్లి తీసుకెళ్లడం జరిగింది. 15.03.2022.
Departmental Activities 2020-21
కరోనా సమయంలో విద్యార్థుల్లో తెలుగుభాషా సాహిత్యాలపై అభిరుచిని పెంపొందించే విధంగా Online Quiz కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 05.2020 – 02.06.2020
కరోనా సమయంలో విద్యార్థుల్లో తెలుగుభాషా సాహిత్యాలపై అభిరుచిని పెంపొందించే విధంగా Online Quiz కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 06.2020 – 08.06.2020
గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. Covid కారణంగా ఈ కార్యక్రమాన్ని ZOOM వేదికగా Online లో నిర్వహించడం జరిగింది. 29.08.2020
ZOOM వేదికగా “సమకాలీన కథ” అనే అంశం పైన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించడం జరిగింది. 6,7.11.2020
Departmental Activities 2019-20
వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని కళాశాలలోని తెలుగు సంస్కృత విభాగాల ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు తమ ప్రసంగంలో వ్యాస పూర్ణిమ వైశిష్ట్యాన్ని తెలియజేశారు. 07.2019.
అతిథి ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రంగస్థల, సినీ నటులు, దర్శకులు శ్రీ నాయుడు గోపి గారు ‘సినీ, నాటక కథా రచనల్లో గల సారూప్య భేదాలు’ అనే అంశంపై ప్రసంగించారు. 18.07.2019.
తెలుగు భాషా దినోత్సవాన్ని, ఆధునిక భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా దినోత్సవాల ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 24-09-2019.
అతిథి ఉపన్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. యం.వి.యస్ ప్రసాదరావు గారు ‘కవికోకిల దువ్వూరి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. 29.01.2020.
ప్రయోగాత్మక నాటకాలు అనే అంశంపై ఒకరోజు workshop ను నర్వహించడం జరిగింది. Resource Persons గా డా. వి. గోపాల కృష్ణమూర్తి, శ్రీ క్రిష్ణేశ్వర రావు విచ్చేశారు. 14.02.2020.
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జె.యం.జె. మహిళా కళాశాల (తెనాలి) తెలుగు విభాగాధిపతి శ్రీమతి బి. మేరి కుమారి ‘మాతృ భాషా పరిరక్షణ – ఆవశ్యకత’ అనే అంశం పై ప్రసంగించారు. 25.2020.
Departmental Activities 2018-19
వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని కళాశాలలోని తెలుగు సంస్కృత విభాగాల ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సాహితీ వాచస్పతి, ఉపన్యాస చతురానన శ్రీమొవ్వ వృషాధిపతి గారిని ఆహ్వానించాము. 07.2018.
క్షేత్ర పర్యటనలో భాగంగా స్పెషల్ తెలుగు, A. తెలుగు విద్యార్థులను పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. 10.08.2018.
తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ముఖ్య వక్తగా ఉపాధ్యాయ MLC డా. యస్. రామకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. 08.2018.
తెలుగు శాఖ అధ్యాపకులు అష్టావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారిని అవధానిగా ఆహ్వానించడం జరిగింది. పుచ్చకులుగా తెలుగు, సంస్కృత అధ్యాపకులతో పాటు జంతుశాస్త్ర, భౌతికశాస్త్ర అధ్యాపకులు పాల్గొనడం జరిగింది. 09.10.2018.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన సారస్వత కళానిధి డా. వెలువోలు నాగరాజ్య లక్ష్మీ గారు “మాతృభాష పరిరక్షణ ఆవశ్యకత” అనే అంశంపై ప్రసంగించారు. 20.02.2019.
Extension Activity లో భాగంగా తెలుగు, NSS విభాగాల ఆధ్వర్యంలో పుల్లడిగుంట గ్రామం లోని మండల పరిషత్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు భాషను నేర్చుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి SKIT రూపంలో తెలియజేయడం జరిగింది. 23.02.2019.
“సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం” అనే అంశం పై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా శ్రీమతి గోటేటి లలితా శేఖర్ విచ్చేశారు. 11.03.2019.
తెలుగు, సంస్కృత, ఆంగ్ల, హిందీ, ఉర్దూ, విభాగాల ఆధ్వర్యంలో “Translation as a Cultural Bridge” అనే అంశం పై National Workshop నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథి గా విచ్చేసిన ప్రముఖ రచయిత శ్రీ రామతీర్థ కీలకోపన్యాసం చేశారు. 03.2019.